విజయ్ ” నోటా “కు దారుణమైన పబ్లిక్ టాక్..!

107

వరుసగా మూడు సూపర్ హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ ద్వారక సినిమా ఒకటి వచ్చి వెళ్లినా అతని కెరియర్ మీద అంత ప్రభావితం చూపించలేదు. ప్రస్తుతం నోటాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. రౌడీ స్టార్ గా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ నోటా సినిమా రాంగ్ సెలక్షన్ అని అంటున్నారు ఆడియెన్స్.

ఈరోజు రిలీజైన ఈ సినిమా పబ్లిక్ టాక్ లో విజయ్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడో.. తలా తోక లేని సినిమా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ టాక్ ఇంత దారుణంగా ఉంది అంటే సినిమా కచ్చితంగా పోయినట్టే.

మంచి ఫాంలో ఉన్న విజయ్ ఈ సినిమాతో వెనుకపడ్డట్టే. హీరోలు అన్నాక హిట్లు ఫ్లాపులు సహజం కాని విజయ్ ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేదని అని అతని రౌడీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

Leave a comment