ఆ సినిమాలు చూడలేదు..

vijay's latest interview

ఒన్ ఫిల్మ్ వండ‌ర్ తో ఆ కుర్రాడు అంద‌రి మ‌న‌సులూ దోచాడు యూత్ కు హార్ట్ త్రోబ్ గా నిలిచాడు విజ‌య్ దేవ‌ర కొండ..ఇటీవ‌ల మీడియాతో ముచ్చ‌టిస్తూ..

‘‘కథ చాలా బలమైనది. దర్శకుడు పాత్రను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కథ విన్న కొద్దిసేపటికే ఆ పాత్రలో నన్ను నేను ఊహించకోవడం ప్రారం భించా. ‘అర్జున్‌రెడ్డి’ని అర్థం చేసుకున్నా. అతను ఎందుకలా ఫీలవుతున్నాడు.. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? దర్శకుడు రాసుకొన్న దానికి అను య‌గుణంగా నా భావోద్వేగాలను మార్చుకుంటూ వచ్చానంతే.ఇక గెటప్‌నకు సంబంధించి, ఒక పద్ధతి ప్రకారం ఆ పాత్రను తీర్చిదిద్దుకున్నాం. ఆ సినిమా చేస్తునన్ని రోజులూ రొమాంటిక్‌ కామెడీ, సున్నితంగా భావోద్వేగాలను కలిగించే సినిమాలకు దూరంగా ఉన్నా. కేవలం డార్క్‌ డ్రామా సినిమాలనే చూస్తూ, వాటినే నా మెదడులో ఎక్కించుకున్నా.’’ అని వివ‌రించాడు. ప్ర‌స్తుతం సెలెక్టివ్ గా  సినిమాలు చేస్తున్నాన‌ని పేర్కొన్నాడు.

Leave a comment