ముద్దుల వీరుడికి … లీకుల గోల..

21

చిన్న హీరోగా ప్రస్థానం ప్రారంభించి స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో అమాంతం క్రేజ్ పెంచుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వచ్చిన గీత గోవిందం తో ఫ్యామిలీ హీరోగా ముద్రవేయించుకున్నాడు. అయితే రాజకీయ కధాంశంతో తెరకెక్కిన ‘నోటా’ తో వచ్చిన క్రిడిట్ అంత కోల్పోయాడు. ఇప్పుడు ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న ‘ టాక్సీవాలా’ మీద పెట్టుకున్నాడు.

కానీ ఇప్పడు ఆ ‘టాక్సీవాలా’ విజయ్ కి రిలీజ్ ముందే చుక్కలు చూపిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ సినిమాపై సెటైర్లు వేయడంతో విజయ్ దేవరకొండకి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది. అయితే ఎడిటింగ్ కూడా పూర్తికాక ముందే ఈ సినిమా హెచ్ డి ప్రింట్ నెట్ లో వైరల్ అవుతోంది.
సినిమా విడుదలైన తర్వాత హిట్, ఫ్లాప్ డిస్కషన్ ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ సినిమాకు మాత్రం విడుదలకు ముందే ఈ చర్చ మొదలైంది.

ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ కాకపోయినా అప్పుడే ఈ సినిమా మీద రివ్యూలు …తీర్పులు చెప్పేస్తూ… వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఈ సినిమా పూర్తిభాగం పెట్టేసారు. ఇప్పటికే ఏ లీకేజీ పై పైరసీ పై నిర్మాతలు సైబర్ క్రైమ్ లో కూడా ఫిర్యాదు చేశారు.

అయితే జరిగిందేదో జరిగిపోయింది అన్నట్టుగా.. ఈ సినిమా ప్రచారంపై దృష్టి పెట్టారు చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రచారం కూడా కాస్త డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా విజయ్ భవిష్యత్తును ఎలా మార్చబోతుందా చూడాలి.

Leave a comment