విజయ్ కి చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్..?

20

అర్జున్ రెడ్డి దెబ్బతో స్టార్ హీరోలందరికి సౌండ్ లేకుండా చేసిన విజయ్ దేవరకొండ. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ తన ప్రతి సినిమాతో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ లో సినిమా చేయకున్నా విజయ్ దేవరకొండకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే అక్కడకు హీరో వస్తాడని తెలియగానే అక్కడ స్టార్స్ కూడా అలర్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీగా కపిల్ దేవ్ బయోపిక్ సినిమాలో నటిస్తాడని అన్నారు.

కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా శ్రీకాంత్ కృష్ణమాచారిగా విజయ్ సెలెక్ట్ అయ్యాడని అన్నారు. కాని అతని ప్లేస్ లో కోలీవుడ్ హీరో జీవాని తీసుకున్నారు. విజయ్ ను తీసుకునే అక్కడ కచ్చితంగా క్రేజ్ సంపాదిస్తాడు. అందుకే అతని బదులుగా సినిమాలో జీవాని సెలెక్ట్ చేశారు. విజయ్ 83 ప్రాజెక్ట్ చేస్తే రణ్ వీర్ తో పాటుగా అతనికి క్రేజ్ రావడం ఖాయం. అది రణ్ వీర్ సింగ్ కు దెబ్బవేసినట్టే అవుతుంది. అందుకే చిన్నగా ఆ పాత్ర నుండి విజయ్ దేవరకొండని తప్పించారు.

డేట్స్ ఖాళీ లేవని విజయ్ తప్పుకున్నాడు. అసలైతే కరణ్ జోహార్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తాడని అన్నారు. కాని ఆ సినిమా కూడా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మరి విజయ్ దేవరకొండని బాలీవుడ్ తొక్కేస్తుందా అన్న వార్తలు వస్తున్నా అవకాశాలు మిస్సవ్వొచ్చేమో కాని టాలెంట్ తొక్కేసే దమ్ము ఎవరికి ఉండదని అంటున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.

Leave a comment