టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో.. ముగ్గురు హీరోయిన్ల‌తో బ్రేక‌ప్‌..!

31

టాలీవుడ్‌లో అతి తక్కువ టైమ్‌లోనే వరుస హిట్లతో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ డియర్ కామ్రేడ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓనమాలు ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బ్రేక‌ప్‌ టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే ఈ సినిమాలో హీరో విజయ్ పాత్ర లీక్ కావడం విశేషం. బ్రేక‌ప్‌లో విజయ్ రైటర్ పాత్రలో కనిపించనున్నాడట. బ్రేకప్ మూడు ఉప కథలకు సంబంధించి ఉంటుందట.

ఈ మూడు కథల్లోనూ హీరోగా ఉండే విజయ్ ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడ‌ట. ఈ ముగ్గురు అనుకోని కారణాలవల్ల అతడి నుంచి విడిపోతార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌లో ముగ్గురు హీరోయిన్లు పాల్గొంటున్నారు. అయితే విజయ్ సినిమాల్లో లిప్ లాక్ సీన్లకు కొదవ ఉండదు. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల్లో లిప్ లాక్‌ల‌తో విజయ్ రెచ్చిపోయాడు.

ఒక హీరోయిన్ ఉంటేనే ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో విజృంభించే విజయ్… ఇక ముగ్గురు హీరోయిన్లతో ఎలాంటి రచ్చ చేస్తాడో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న డియర్ కామ్రేడ్‌ సినిమాలో కూడా విజయ్ తనకు కలిసి వచ్చిన హీరోయిన్ రష్మిక మందన్నతో లిప్ లాక్ సీన్ల‌లో అదరగొట్టాడట. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన గీతాగోవిందం సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

Leave a comment