Gossipsఅల్లు కుటుంబాన్ని ఘోరంగా అవమానించిన విజయ్ దేవరకొండ..!

అల్లు కుటుంబాన్ని ఘోరంగా అవమానించిన విజయ్ దేవరకొండ..!

టాలీవుడ్ లో ప్రస్తుత యంగ్ హీరోల్లో టాప్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తన వైవిధ్యమైన నటనతో … తన యాటిట్యుట్ తో అందరి ప్రశంసలు పొందుతున్నాడు. గీత గోవిందం సినిమా విజయ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఆ తరువాత పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో విడుదలయిన ‘నోటా ‘ నిరాశపరిచిన ప్రస్తుతం విడుదలయిన టాక్సీవాలా విజయ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన కిక్ విజయ్ లో ఎక్కడ లేని ఆనందానికి కారణం.
2
‘టాక్సీవాలా’ మొదటిరోజు హిట్ టాక్ రాగానే ‘టాక్సీవాలా’ టీమ్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ‘టాక్సీవాలా’ టీమ్ తో పాటుగా అల్లు అరవింద్.. దర్శకుడు మారుతి కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆనందంలో అల్లు అరవింద్ భుజాల మీద చేయి వేసి నిలబడ్డాడు. ఈ ఫోటో కూడా మీడియాలో బయటకు వచ్చింది. విజయ్ అలా చేయడం అక్కడ ఉన్న చాలామందికి నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
1 అరవింద్ టాలీవుడ్ లో ఉన్న సీనియర్స్ లో ఒకరని.. అయనతో విజయ్ ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విషయంపై అరవింద్ సన్నిహితులయితే ఏకంగా… విజయ కే వార్నింగ్ లు ఇచ్చేయడంతో నా ఉద్దేశం అది కాదు అని … ఆయన తన తండ్రిలాంటి వ్యక్తి అంటూ… ఏదో చనువుకొద్దీ అలా చేసాను అంటూ సరిచెప్పుకున్నాడట ఈ అర్జున్ రెడ్డి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news