GossipsRGV " వెన్నుపోటు " ఫుల్ వీడియో సాంగ్.. ఆర్జివి చెప్పినట్టే...

RGV ” వెన్నుపోటు ” ఫుల్ వీడియో సాంగ్.. ఆర్జివి చెప్పినట్టే చేస్తున్నాడు..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టాడు ఆర్జివి. క్రిష్ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రిలీజ్ టైంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ నుండి మొదటి సాంగ్ వెన్నుపోటు అంటూ తన సినిమా మెయిన్ కాన్సెప్ట్ మొత్తం చంద్రబాబు మీదే అంటూ చెప్పకనే చెప్పాడు ఆర్జివి. సినిమాలో ఈ సాంగ్ ను సిరాశ్రీ రాయగా కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందించాడు.

ఎన్.టి.ఆర్ అసలు బయోపిక్ ఇదే అంటూ ఆయన ఆశీర్వాదాలు ఈ సినిమాకే ఉంటాయంటూ సినిమా ఓపెనింగ్ నాడు ఛాలెంజ్ చేసి మరి చెప్పాడు ఆర్జివి. చూస్తుంటే ఆర్జివి అన్నంత పని చేసేలా ఉన్నాడు. కుట్ర కుట్ర అంటూ చంద్రబాబు, ఎన్.టి.ఆర్ ఫోటోల మీద కట్ చేసిన ఈ వెన్నుపోటు సాంగ్ నిజంగానే ఎన్.టి.ఆర్ బయోపిక్ కు వెన్నుపోటుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా జనవరి 24న రిలీజ్ ఫిక్స్ చేశాడు ఆర్జివి.

బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎక్కడ పూర్తవుతుందో అక్కడి నుండే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మొదలవుతుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ చివరి రోజుల్లో ఎలా అతన్ని ట్రీట్ చేశారని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తారట. మరి ఈ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రభావం ఎన్.టి.ఆర్ బయోపిక్ మీద ఏమేరకు పడుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news