వెంకీ, చైతు మల్టి స్టారర్ …డైరెక్టర్ ఎవరో తెలుసా..?

naga chaitanya and venkatesh

ఇప్పుడున్న హీరోలలో వెంకటేష్ తీసినన్ని మల్టీస్టార్ర్స్ మారె హీరో తీయలేదు. అందరూ వారి స్టార్డమ్ పై ఎఫెక్ట్ పడుతుందని భయమో ఏమో ఎవ్వరు దానిపై ఆసక్తి చూపడంలేదు. వెంకటేష్ మాత్రం చిన్న పెద్ద హీరోలని తేడా లేకుండా ఎనెర్జిటిక్ హీరో రామ్ నుండి మహేష్ , పవన్ల వరకు అందరితో మల్టీస్టార్ర్స్ చేసి పడేసారు.

త్వరలో మారో మల్టి స్టారర్ సినిమాను చెయ్యడానికి సిద్ధమైయ్యారు విక్టరీ వెంకటేష్. అది కూడా తన మేనల్లుడు నాగ చైతన్య తోనే అని తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన – రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో తండ్రి కొడుకులకి హిట్స్ ఇచ్చిన కళ్యాణ్ కురసాల ఈసారి మామ అల్లుళ్ల కాంబో లో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

చైతు కూడా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ హీరో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ తేజా దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ లో ఉంటుంది. అప్పటివరకు స్క్రిప్ట్ రెడీ అయితే మల్టి స్టారర్ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాలని వెంకీ ఆలోచిస్తున్నాడు. ఈ మామ అల్లుళ్ళ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Leave a comment