Gossipsఅజ్ఞాతవాసిలో ఉన్న మరో అజ్ఞాతవాసి ఎవరూ..?

అజ్ఞాతవాసిలో ఉన్న మరో అజ్ఞాతవాసి ఎవరూ..?

పవన్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా మీద అందరికి భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా మీద రోజు రోజుకు ఎదో ఒక వార్త బయటకి లీక్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అజ్ఞాతవాసి గురించి ఎవరూ ఊహించని వార్తలు బయటకి వచ్చాయి. ఈ మధ్య బాగా పాపులర్ అయిన కొత్త ట్రెండ్ మల్టీ స్టార్. గతంలో పెద్దగా ఈ ట్రెండ్ లేకపోయినా ఈ మధ్యకాలంలో మాత్రం బాగా పాపులర్ అయ్యింది. దీంతో అందరూ ఈ ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు.
పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌ అతిథి పాత్రలో మెరవబోతున్నట్టు సమాచారం బయటకి పొక్కింది. గతం లోనే పవన్ – వెంకీ కలసి ‘గోపాల-గోపాల’ చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి పేరు సంపాదించుకుంది. మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ పవన్ సినిమా  ‘అజ్ఞాతవాసి’లో వెంకటేష్‌ ఓ అతిథి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.
 వెంకీ నటించిన ‘నువ్వునాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్‌ మాటలు రాశారు. త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేయనున్నారు. మరి ‘అజ్ఞాతవాసి’లో వెంకటేష్‌ పాత్ర ఏంటి అనేది మాత్రం తెలియడంలేదు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవ్వబోతోంది. ఈనెల 19న ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news