Gossips'అజ్ఞాతవాసి నుంచి తప్పుకున్న వెంకీ ! కారణం ఏంటంటే..? 

‘అజ్ఞాతవాసి నుంచి తప్పుకున్న వెంకీ ! కారణం ఏంటంటే..? 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,విక్టరీ వెంకటేష్ లు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో గోపాల గోపాల చిత్రంలో నటించి అభిమానులను మెప్పించారు. ఐతే ఇది అభిమానులు ,మాస్ ప్రేక్షకులు కోరుకునే  కమర్షియల్ సినిమా కాకపోవడంతో ఆ లోటుని త్రివిక్రమ్ సినిమాలో తీర్చుకుందామని చూసారు. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ లో వెంకీ రోల్ అవసరం లేకపోవడంతో ఈ క్రేజీ కాంభినేషన్ ఆగిపోయింది.

పవన్ త్రివిక్రమ్ కంబినేషన్ లో రాబోతున్న అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటివరకు వార్తలు వినిపించాయి. ఓ కీలక సన్నివేశంలో  వెంకీ గెస్ట్ పాత్రలో చేయబోతున్నాడని వార్తలు కూడా బయటకి వచ్చేయడంతో ఇరువురు హీరోల అభిమానులు కూడా చాలా సంతోషపడ్డారు. మళ్లీ గోపాల గోపాల సినిమాలో లా ఆ కేరేజి కాంబినేషన్ చూడవచ్చు అని ఆశ పడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. వెంకీ కోసం ప్రత్యేకంగా రాసుకున్న గెస్ట్ రోల్ ఇప్పుడు ఆ సినిమాలో పెద్దగా అవసరం లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ లో వెంకీ రోల్ తీసేశారని తెలుస్తోంది.

అయితే అజ్ఞాతవాసిలో వెంకటేష్ ను తప్పించడం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, వెంకీతో ఈ విషయం గురించి క్షుణ్ణంగా చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కానీ మళ్లీ పవన్ తో ఏదైనా సినిమాలో ఈ క్రేజీ కాంబినేషన్ ఉండేలా  ప్లాన్ చేస్తారేమో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news