Movies టీజర్ టాక్ : ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టమంటున్న...

టీజర్ టాక్ : ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టమంటున్న ‘గురు’

Victory Venkatesh’s latest film Guru teaser has released. In this video venki looks as arrogant boxer coach and Rithika Singh as usual in trainee character.

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గురు’. తమిళంలో మాధవన్ హీరోగా రూపొందిన ‘ఇరుధు సుట్రు’కి రీమేక్‌కి ఇది రీమేక్. మాతృకలో ప్రధానపాత్ర పోషించిన రితిక సింగ్ ఇందులోనూ అదే క్యారెక్టర్‌లో నటించింది. ఈమధ్యే ఈ మూవీకి సంబంధించి రిలీజైన పోస్టర్లకు మంచి రెస్పాన్సే వచ్చింది. ముఖ్యంగా.. వెంకటేష్ గెటప్‌కి అదిరిపోయే స్పందనొచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. పదండి.. అదెలా ఉందో చూద్దాం..

‘బాక్సింగే నా ప్రాణం’ అనే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్‌లో ఓ బాక్సర్ లైఫ్ గురించి చూపించారు. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న శిష్యులకు బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందేందుకు కోచ్ ఎంత కఠిన శిక్షణ అందిస్తున్నాడోనన్న అంశాన్ని ఈ టీజర్‌లో రివీల్ చేశారు. బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. పాత్రకి తగ్గట్టుగా తనని తాను మలచుకున్న విధానం బాగుంది. ఈ టీజర్‌లో ఆయన చెప్పిన ఓ డైలాగ్ బాగుంది. ‘మీరు నేను చెప్పిందే వింటారు.. చెప్పిందే తింటారు.. ఇల్లు-వాకిలి, ప్రేమా-దోమా, చెత్త-చెదారం అన్ని పక్కనపెట్టి, ఒళ్లు వంచి ట్రైన్ చేయండి’ అనే డైలాగ్ బాగా పేలింది. ఆ డైలాగ్‌ని వెంకీ చెప్పిన విధానం, వాయిస్‌లో గ్రేస్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఇక రితికా సింగ్ ఆల్రెడీ తమిళ్‌లో నటించి, తన టాలెంట్ ఏంటో నిరూపించింది. ఈ టీజర్‌లోనూ అదే జోష్‌తో కనిపించింది.

టెక్నికల్ పరంగా చూస్తే.. డైరెక్టర్ టేకింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ అదిరింది. ఓవరాల్‌గా.. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news