బిగ్ బాస్ కి పిలిచి మరి అవమానించారంటూ వెంకీ ఫైర్..!

98

బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా ముగించాడు. 18 మంది కంటెస్టంట్స్ లో ఫైనల్ గా కౌశల్ విన్నర్ గా నిలిచాడు. ఫైనల్ ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ ను ఇన్వైట్ చేశారు. అయితే వెంకటేష్ ను ఓ సాదా సీదా హీరోలానే వెంకటేష్ నిర్వాహకులు ట్రీట్ చేయడం దగ్గుబాటి ఫ్యాన్స్ ను ఇబ్బందికి గురి చేసింది.

వెంకటేష్ వచ్చినప్పుడు బలపంపట్టి భామ వల్లో పాట ప్లే చేశారు అంతే కాని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎనౌన్స్ చేసినప్పుడు.. ఫైనల్స్ ఇద్దరు స్టేజ్ మీదకు వచ్చినప్పుడు స్టేజ్ మీద మెరుపుల బాంబులు పేల్చారు. వెంకటేష్ వచ్చినప్పుడు మాత్రం మాములుగా కానిచ్చారు. అంతేకాదు వెంకటేషే విన్నర్ ను ప్రకటిస్తాడు అనుకుంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బిగ్ బాస్ నాని టివిలో బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించారు.

మరి అసలు వెంకటేష్ ను పిలవడం ఎందుకు ఇంతగా అవమాన పరచడం ఎందుకని బిగ్ బాస్ టీం మీద కారాలు మిరియాలు నూరుతున్నారు వెంకటేష్ ఫ్యాన్స్. అయితే వీటి గురించి వెంకీ ఎలాగు పట్టించుకోడు కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాని ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అయినట్టు తెలుస్తుంది.

Leave a comment