Gossipsఫిదా ఎఫెక్ట్.. వరుణ్ తేజ్ డేరింగ్ స్టెప్..!

ఫిదా ఎఫెక్ట్.. వరుణ్ తేజ్ డేరింగ్ స్టెప్..!

మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ కెరియర్ లో కమర్షియల్ హిట్ కొట్టడం లేట్ అయినా సరే ఫిదా హిట్ తో తన రేంజ్ ఏంటో చూపించేశాడు. ముకుందతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ కంచెతో మంచి ప్రయత్నం చేసినా ఆ తర్వాత సినిమాలు అతనికి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక శేఖర్ కమ్ముల ఫిదాతో ఒక్క సారిగా హిట్ మజాని ఎంజాయ్ చేసిన వరుణ్ తేజ్ ఆ ఎఫెక్ట్ తో డేరింగ్ స్టెప్పులు వేస్తున్నాడు.

ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ తన తర్వాత సినిమా ఘాజి డైరక్టర్ తో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఘాజి సినిమాతో దర్శకుడిగా తన పనితనం చూపించిన సంకల్ప్ రెడ్డి మరో డిఫరెంట్ స్టోరీతో వరుణ్ తేజ్ ను కలిశాడట. కథ నచ్చేయడంతో వరుణ్ తేజ్ కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. పివిపి బ్యానర్లో రాబోతున్న ఈ సినిమా వరుణ్ టేస్ట్ తెలియచేసే సినిమాగా ఉంటుందట. మరి ఘాజి లాంటి కాన్సెప్ట్ సినిమా తీసిన సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ తో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news