Uncategorizedఎన్టీఆర్ నో అంటే.. గుడ్డిగా ఒప్పేసుకున్న వరుణ్ తేజ్

ఎన్టీఆర్ నో అంటే.. గుడ్డిగా ఒప్పేసుకున్న వరుణ్ తేజ్

Mega hero Varun Tej given green signal to do a sensational movie which is rejected by young tiger NTR recently. Actually that story is very different, and everyone thinks that NTR will accept to do the project. But, in the last minute he dropped out and don’t know why?

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయలేదు కానీ.. కథలు మాత్రం చాలా విన్నాడు. ఐదారుమంది దర్శకులు తమ దగ్గరున్న కథల్ని వినిపించగా.. అందులో ఏదీ నచ్చక రిజెక్ట్ చేశాడు. అయితే.. ఒక కథని మాత్రం కాస్త సీరియస్‌గా తీసుకున్నాడు. అదే.. ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి చెప్పిన అంధుడి స్టోరీ. కథ ప్రకారం.. ఇందులో హీరో మొదటినుంచి చివరి వరకు గుడ్డివాడి క్యారెక్టర్ పోషించాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ వెరైటీగానూ, బలంగానూ ఉండడంతో.. తొలుత ఈ మూవీ చేయాలని అనుకున్నాడు. కానీ.. చివరి నిముషంలో వద్దని రిజెక్ట్ చేశాడు.

నిజానికి.. అనిల్ ఈ కథని మొదట ఎనర్జిటిక్ హీరో రామ్‌కి వినిపించాడు. అతను చేయనని చెప్పడంతో తారక్ దగ్గరకు వస్తే.. అక్కడా అనిల్‌కి నిరాశే మిగిలింది. దీంతో.. స్టోరీ ఎవరికి చెప్పాలా? అని ఆలోచనలో పడ్డా అనిల్‌కి మెగాహీరో వరుణ్ తేజ్ పేరు తట్టింది. అంతే.. క్షణం ఆలస్యం చేయకుండా స్టోరీ తీసుకుని అతని వద్దకు వెళ్ళాడు. తాను రాసుకున్న అంధుడి స్టోరీని మొదటినుంచి చివరి వరకు రెండున్నర గంటలపాటు వివరించాడు. స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉండడంతో వరుణ్ ఖంగుతిన్నాడట. అంధుడి క్యారెక్టర్ చుట్టూ నడిచే ఈ కథ మైండ్‌బ్లోయింగ్ అంటూ అతనికి కితాబిస్తూ.. ఈ సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట.

ఆల్రెడీ వరుణ్ డిఫరెంట్ కథాచిత్రాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి ఇతనికి ఓ ఆ స్ర్కిప్ట్ చెప్పడంతో.. సినిమా చేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుందని భావించి పచ్చజెండా ఊపాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫైనల్‌గా నాగబాబు కూడా ఓకే అంటే.. ఈ సినిమా రూపొందడం ఖాయమని అంటున్నారు. మరి.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేదా? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news