బాబుని పాటిస్తే లక్ష .. వర్మ అదిరిపోయే ట్విస్ట్ ..!

139

ఎన్.టి.ఆర్ బయోపిక్ కి పోటీగా రాం గోపాల్ వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మళ్లీ ఊపందుకుంది. వర్మ నిన్న తన సామాజిక మాధ్యమాలలో లక్ష్మీస్ వర్మ మొదలు పెడుతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ ను కూడా ఫిక్స్ చేసి చెప్పాడు. ఇదిలాఉంటే సినిమాలో అసలు సిసలు ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర తాను చూపించబోతున్నానని అంటున్నాడు.

వర్మ తన గురి అంతా చంద్రబాబు నాయుడు మీద పెట్టినట్టు తెలుస్తుంది. అయితే దానిలో భాగంగా ఈరోజు అచ్చం చంద్రబాబు పోలికలతో ఉన్న ఒకతని వీడియో పెట్టి ఇతన్ని గుర్తించి తమని మెయిల్ చేస్తే వారికి లక్ష రూపాయలు అందిస్తామని అన్నాడు. వీడియోలోని వ్యక్తి బాబులా ఉండటమే విశేషం. సరిగ్గా చెప్పాలంటే బాబు జిరాక్స్ కాపీలా ఉన్నాడు అతను. మరి అతనెవరు ఎక్కడ ప్రాంతం వాడు అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment