ఎన్టీఆర్ పై వర్మ ఘాటు వ్యాఖ్యలు…

varma satire on ntr

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వివాదాలకు దూరంగా ఉంటే అంత పెద్ద కిక్ ఉండదు. అందుకే వర్మ తాజాగా మరో సెన్సెషనల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రతో ‘లక్ష్మీస్ ఎన్.టి.ఆర్’ అంటూ సినిమా ఎనౌన్స్ చేసిన ఆర్జివి ఆ సినిమాపై తెలుగు తమ్ముళ్ల కోపానికి కారకుడయ్యాడు. ఈ సినిమాలో కచ్చితంగా చంద్రబాబు మీద నెగటివ్ గా వస్తుందని అనుకున్నారు.

అయితే ఆ విషయం గమనించిన చంద్రబాబు భక్తుడు బాబు రాజేంద్రప్రసాద్ వర్మతో ఖబడ్దార్ అంటూ చాలెంజ్ చేశాడు. బ్లూ ఫిలింస్ తీసే వర్మ తన చరిత్ర రాయించుకోవాలని అన్నారు. అయితే వర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా ఎవడు రాజేంద్ర ప్రసాద్..? అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఇదే విషయం మీద తన ఫేస్ బుక్ పేజ్ లో ‘ఎన్.టి.ఆర్ చెప్పిన విషయాలు’ అంటూ పెద్ద స్టోరీ రాసేశాడు.

ఇక ఇది కచ్చితంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పకనే చెబుతున్నాడు.. అందుకే ఒకవేళ నీకు దమ్ముంటే లక్ష్మి పార్వతి విషయంలో ఎన్.టి.ఆర్ మైండ్ దొబ్బిందని ఒప్పుకో అంటూ రాజేంద్ర ప్రసాద్ పై విరుచుకు పడ్డాడు. వర్మ ఇంత హంగామా చేస్తున్నా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా శశికళలానే కేవలం మాటల వరకేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

Leave a comment