ముగ్గురికి “గే” అని ముద్ర వేసిన రామ్ గోపాల్ వర్మ

rajmouli

రాంగోపాల్ వర్మ … ఈ పేరే ఒక వివాదం. ఎక్కడ కాంట్రవర్సీ ఉంటుందో అక్కడ వర్మ ఉంటాడు. అసలు వర్మ అంటేనే కాంట్రవర్సీ. గిల్లి గిల్లించుకోవడం ఈయనగారికి బాగా అలవాటు. అసలు కావాలని వివాదాల్లోకి దూరుతాడో లేక అసలు అతని నైజం అంతేనా అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయం.

తాజాగా డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఒక ఫోటోపై వర్మ చేసిన ట్విట్ ఆ హీరోల అభిమానుల్లో కాక రేపుతోంది. తిట్టినా తిట్టు తిట్టకుండా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు. ఎవరు ఎన్ని తిట్టినా అయన మాత్రం మారడు ఎందుకంటే ఆయనకు కొంచెం తిక్క ఉంది దానికి మాత్రం లెక్కే లేదు.

అసలు రాంగోపాల్ వర్మ ట్విట్ చెయ్యడానికి ఈ వివాదం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే..
డైరెక్టర్‌ రాజమౌళి తన ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో పోస్టు చేశాడు. ఆ ఫొటోలో మధ్యలో రాజమౌళి ఒకవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌లు కూర్చొన్నారు. ఈ పోస్టుపై విమర్శాత్మక డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన రీతిలో కామెంట్స్‌ చేశాడు.

వర్మ తన ఫేస్‌బుక్‌లో ‘ ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా .. పైగా ముగ్గురు కూడా పెళ్లైన వాళ్లు.. అల్లా ఏం జరుగుతుంది ? జీసస్‌ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. బాలాజీ గారు మీరైనా చెప్పండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఫ్యాన్స్‌ తమదైన రీతిలో స్పందించారు. ఒక అభిమాని అయితే ‘ ఓ జంతువూ.. నువ్వు గేలా ఉండి అందరిని అంటావేంటిరా’ అని వర్మపై విరుచుకుపడ్డాడు.1

మరో అభిమాని‘ పచ్చ కామెర్లు వ్యాధి ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అనే సామెత’ వర్మకి సరిపోతుందని కామెంట్‌ చేశాడు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో మల్టీ స్టార్‌ మూవీ 2018లో మొదలవుతుంది.. టాలీవుడ్‌ రికార్డులని బద్దలయ్యే క్షణం.. అని ఓ అభిమాని పోస్టు చేశాడు.Untitled

Leave a comment