Gossipsసన్నీ జాతీయ స్థాయి ... పవన్ ప్రాంతీయ స్థాయి ..

సన్నీ జాతీయ స్థాయి … పవన్ ప్రాంతీయ స్థాయి ..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఈ సారి పవన్ కళ్యాణ్ వర్మ నోట్లో పడ్డాడు. అసలు ఏముందో ఏమో కానీ సడెన్ గా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై ఈ వ్యాఖ్యలు చేసాడు.

నాకు పవన్ కళ్యాణ్ కంటే ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ అంటేనే ఎక్కువ గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. సన్నీలియోన్ జాతీయ స్థాయి సెలెబ్రిటీ అని, పవన్ కల్యాణ్ మాత్రం కేవలం ప్రాంతీయ సెలెబ్రిటీ అని రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసాడు. మొత్తం భారతదేశంలో మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం సన్నీలియోన్ మాత్రమేనని వర్మ చెప్తున్నాడు.

ఈ విషయంలో ఎవరూ ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరమే లేదని వర్మ అన్నాడు. . సమాజం కోసం పాటుపడతానని చెబుతున్న పవన్ కల్యాణ్ కన్నా సన్నీలియోన్ ఇంకా ఎక్కువగా సమాజం కోసం పాటుపడతానని చెప్పిందని వర్మ తన వివాస్పద మాటల తూటాలు బయటకి వదిలాడు. వివాదాలు పవన్ కి కొత్తేమి కాకపోయినా … ఆయన పవన్ మీద కామెంట్స్ చెయ్యడం మాత్రం పెద్ద సంచలనమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news