హీటెక్కిస్తున్న హీరోయిన్‌తో ధనుష్ రొమాన్స్..

5

ఇప్పటి సినిమాల్లో లిప్ లాక్స్ ట్రెండీగా మారాయి కాని బుగ్గ మీద ముద్దుపెట్టే టైంలోనే ఎలాంటి వెనుకడుగు లేకుండా కమల్ హాసన్ హీరోయిన్స్ తో లిప్ లాక్స్ చేశాడు. కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా కమల్ లా రొమాన్స్ చేసే హీరో లేడని అప్పట్లో ఓ టాక్ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం స్టార్ హీరోల్లో కోలీవుడ్ స్టార్ ధనుష్ ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.

తన ప్రతి సినిమాలో ఘాటు అదరచుంభణం ఉండేలా చూసుకునే ధనుష్ లేటెస్ట్ గా చేస్తున్న వడా చెన్నై సినిమాలో లిప్ లాక్ చేశాడు. ఐశ్వర్య రాజేష్ తో ధనుష్ లిప్ లాక్ చర్చల్లో నిలిచింది. అయితే కమల్ నటించిన విశ్వరూపం-2 ట్రైలర్ లో కూడా పూజా కుమార్ తో కమల్ లిప్ లాక్ చేశాడు. ఒకప్పటి లిప్ లాక్ హీరోతో పోటీ పడిన ధనుష్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అందుకే విశ్వరూపం-2 టీజర్ ను మించి వడా చెన్నై టీజర్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది. మరి సినిమాల ఫలితాల పరంగా ఎవరు ఎలా సత్తా చాటుతారో చూడాలి.

Leave a comment