భరత్ ను చూసేందుకు వచ్చిన రియల్ సిఎం..!

uttarkand-cm-meets-mahesh-babu

మహేష్ ను హిట్ ట్రాక్ ఎక్కించేసిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ సిఎంగా నటించాడు. అయినా ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులవుతుంది కదా మరి ఇప్పుడు ఎందుకు రియల్ సిఎం మహేష్ ను కలిశాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మహేష్ ను కలిసేందుకు వచ్చారు అంటే.. ఉత్తరాఖండ్ సిఎం అని తెలుస్తుంది.

భరత్ సినిమా కోసం కాదు మహేష్ నటిస్తున్న 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఈరోజు డెహ్రాడూన్ లో మొదలయ్యింది. ఈ షూటింగ్ స్పాట్ కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ వచ్చి మార్యాదపూర్వకంగా కలిశారు. కేవలం తెలుగు సినిమాల్లోనే నటించినా మహేష్ కు నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉంది.

ఇదవరకు స్పైడర్ సినిమా టైంలో కూడా మహేష్ ను కలిసేందుకు గుజరాత్ డిప్యూటీ సిఎం వచ్చారు. మహేష్ అంటే తమ ఫ్యామిలీకి చాలా ఇష్టమని ఆయన తన కుటుంబంతో వచ్చి మహేష్ ను కలిశారు. మొత్తానికి బీ టౌన్ కు వెళ్లడానికి ముందే అక్కడ రాజకీయ నాయకులకు తెలిసేలా మహేష్ క్రేజ్ ఉంది అంటే ఇక అక్కడకు ఎంట్రీ ఇచ్చే టైం వచ్చిందనే చెప్పాలి.

mahesh babu

Leave a comment