Gossipsసాయి ధరమ్ తేజ్ - ఆకలి రాజ్యం ...!

సాయి ధరమ్ తేజ్ – ఆకలి రాజ్యం …!

మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పుట్టిన రోజు సందర్బంగా ఫేస్ బుక్ లైవ్ లో తళుక్కు మన్నారు. అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ లైవ్ లో సాయి ధరమ్ పలువురు ఆయనను విష్ చేయగా ధన్యవాదాలు తెలిపారు . జవాన్ రిలీజ్ ఎప్పుడు అని ఓ అభిమాని అడగ్గా ఇంకా డిసైడ్ కాలేదని , త్వరలోనే చెప్తాను అని సమాధానం ఇచ్చారు ఈ యంగ్ హీరో .

మల్టీ స్టారర్ ల పై తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసారు తేజ్ . నాని తో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాటని బయట పెట్టారు. అయితే తన మేనమామలు చేసిన రౌడీ అల్లుడు, తోలి ప్రేమ రీమేక్ ల పై ప్రశ్నలు అడిగితే, అవి క్లాస్సి చిత్రాలని, వాటిని తాను మళ్ళి చేసి మెప్పించలేనని నిజాన్ని నిర్భయంగా ఒప్పేసుకున్నారు .

అయితే ఒక అభిమాని సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటి అని అడగగా నిరుద్యోగం, వేరే అవకాశాలు లేకపోవడం అని చమత్కరించారు . మొత్తానికి సాయి ధరమ్ లౌక్యం వున్నా హీరో అని మరో సారి నిరూపించుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news