టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్: తేజ డైరక్షన్ లో ఉదయ్ కిరణ్ “కాబోయిన అల్లుడు”

uday-kiran-teja-movie

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా సక్సెస్ ఫుల్ అవడంతో సెట్స్ మీద ఉన్న బయోపిక్ సినిమాలకు కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్, యాత్ర సినిమాలే కాదు మహానటి తర్వాత కొత్త బయోపిక్ లను తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది.

చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది దర్శకుడు తేజనే. నువ్వు నేను, ఔనన్నా కాదన్న్నా సినిమాలను కలిసి చేశారు. కెరియర్ అంత సాటిస్ఫైడ్ గా లేని ఉదయ్ కిరణ్ కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి బయటకు వచ్చిన తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయలని ఫిక్స్ అయ్యాడట.

ఇక ఈ సినిమాకు టైటిల్ గా కాబోయిన అల్లుడు అంటూ చెబుతున్నాడు. ఉదయ్ కిరణ్ కెరియర్ మంచి ఫాం లో ఉన్న టైంలో చిరంజీవి తన పెద్ద కూతురిని ఇచ్చి పెళ్లి చేయదలచాడు. ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన ఆ పెళ్లి కాస్త పెటాకులయ్యింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరియర్ గ్రాఫ్ పడిపోయింది. మరి తేజ చేస్తున్న ఉదయ్ కిరణ్ బయోపిక్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment