టాప్ సింగర్ ని రేప్ చేస్తానన్న ఉబెర్ డ్రైవర్..!

99

పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న మన దేశంలో మహిళలపై నిత్యం ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. మహిళలకు రక్షణ కల్పించేందుకు వారి కోసం ఎన్ని కఠినమైన చట్టాలు రూపొందించినా .. అవేవి వాటిని ఆపలేకపోతున్నాయి. ఇక విషయానికి వస్తే … తన బంధువులతో కలిసి బయటికి వెళ్లేందుకు కోల్‌కతా కు చెందిన ఓ సింగర్ క్యాబ్ ని బుక్ చేసుకుంది.

కారు నడుస్తుండగా డ్రైవర్ ఫోన్ అనేక సార్లు రింగ్ అయ్యింది. దీంతో ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయాలని ఆమె డ్రైవర్ ను కోరింది. దీంతో కోపంతో ఊగిపోయిన డ్రైవర్ నోరు మూసుకుని కూర్చోవాలని, లేదంటే ఇంటికొచ్చి మరీ రేప్ చేస్తానని బెదిరించాడు.దీంతో భయపడిన ఆ గాయకురాలు ట్రాపిక్ సిగ్నల్ వద్ద క్యాబ్ ఆగగానే అప్రమత్తమై ట్రాఫిక్ పోలీసుకు విషయం చెప్పింది. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్‌ను సీజ్ చేశారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన ఉబెర్ యాజమాన్యం మహిళకు మద్దతుగా నిలిచింది. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చింది. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే మహిళలు ఏ స్థాయిలో ఉన్నా … వేధింపులు మాత్రం కామన్ అని అర్ధం అవుతోంది.

Leave a comment