U Turn (తెలుగు) ఆఫీషియల్ ట్రైలర్…తెలుగులో మరో సస్పెన్స్ థ్రిల్లర్..!

73

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ సినిమాకు తెలుగు రీమేక్ గా వస్తున్న సినిమా యూటర్న్.. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవింద్రన్ నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా ట్రైలర్ చూస్తేనే ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వస్తుందని తెలుస్తుంది. ట్రైలర్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసే సినిమాల్లో ఇది ఒకటని చెప్పొచ్చు.

సమంత నటన హైలెట్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. ఇక సినిమాలో భూమిక కూడా నటిస్తుందని తెలుస్తుంది. మాత్రుక దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ అదుర్స్ అనిపించగా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Leave a comment