Gossips" యు ట‌ర్న్" సెన్సార్ పూర్తి..సినీవర్గాలకి షాక్..!

” యు ట‌ర్న్” సెన్సార్ పూర్తి..సినీవర్గాలకి షాక్..!

సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు ప్ర‌మోష‌న‌ల్ వీడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. యు ట‌ర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది ఈ చిత్రం. రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు.

న‌టీన‌టులు:
స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ ర‌వీంద్ర‌న్, న‌రైన్

సాంకేతిక విభాగం:
క‌థ‌, ద‌ర్శ‌కుడు: ప‌వ‌న్ కుమార్
నిర్మాత‌లు: శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు
బ్యాన‌ర్స్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్
సంగీతం: పూర్ణచంద్ర తేజ‌స్వి
సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి
ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్
ఎడిటర్: సురేష్ ఆర్ముగం
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Cast: Samantha, Aadhi Pinisetty, Rahul Ravindran, Bhumika Chawla, Narain
Crew:
Story & Direction: Pawan Kumar
Producers: Srinivasaa Chitturi and Rambabu Bandaru
Banners: Srinivasaa Silver Screen and VY Combines
Music: Poorna Chandra Tejaswi
Cinematography: Niketh Bommi
Art Director: AS Prakash
Editor: Suresh Arumugam
PRO: Vamsi-Shekar
027 - ONLINE - SENSOR POSTER

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news