భార్య‌పై హీరో మ‌ర్డ‌ర్ ప్లాన్‌… చివ‌ర్లో ట్విస్ట్‌

10

శాండ‌ల్‌వుడ్ హీరో త‌న భార్య‌ను మ‌ర్డ‌ర్ చేసేందుకు వేసిన ప్లాన్ చివ‌ర్లో ఊహించ‌ని ట్విస్ట్‌తో మ‌లుపులు తిరిగింది. అచ్చం సినిమాను త‌ల‌పించేలా ఉన్న ఈ ప్లాన్‌లో చివ‌ర‌కు హీరోగారు పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయి జైలు పాల‌య్యాడు. ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. బెంగ‌ళూరులో నివాసం ఉంటే క‌న్న‌డ సినిమా హీరో శ‌బ‌రీష్ సినిమాల్లో చిన్నాచిత‌కా వేషాలు వేసుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా మ‌నోడికి రెండు సినిమాల్లో హీరో ఛాన్సులు వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కాలేదు.

ఈ క్ర‌మంలోనే త‌న‌కు ప‌రిచ‌యం అయిన ప‌ద్మ‌శ్రీ అనే అమ్మాయిని మాయ‌మాట‌లు చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌టికే శ‌బ‌రీష్‌కు పెళ్లి అయ్యి పిల్ల‌లు కూడా ఉన్నారు. ప‌ద్మ‌శ్రీ సినిమా ఇండ‌స్ట్రీలో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న టైంలో ఆమెకు శ‌బ‌రీష్ ప‌రిచ‌యం అయ్యాడు. ఆమెకు మాట‌మాట‌లు చెప్పి లోబరుచుకోవ‌డంతో పాటు త‌న సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది తెలుసు అని… హీరోయిన్‌గా మంచి అవ‌కాశాలు ఇస్తాన‌ని న‌మ్మించాడు.

కేఆర్‌ పురం శివార్లలోని భట్టరహళ్లిలో కాపురం పెట్టిన శబరీష్ అసలు రంగు కొన్నేళ్ళకే పద్మ శ్రీకి తెలిసింది. అప్ప‌టికే అత‌డికి పెళ్ల‌య్యి… పిల్ల‌లు ఉన్నార‌న్న విష‌యం తెలియ‌డంతో ప‌ద్మ‌శ్రీ శ‌బ‌రీష్‌ను నిల‌దీసింది. త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య కొద్ది రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎలాగైనా ప‌ద్మ‌శ్రీను వ‌దిలించుకోవాల‌ని డిసైడ్ అయిన శ‌బ‌రీష్ కొద్ది రోజులుగా కుట్ర‌ప‌న్నాడు. ఐదుగురు స్నేహితులని పిలిపించి ఆమెను హత్య చేయాలనీ ప్లాన్ వేశాడు.

ముందుగా ప‌ద్మ‌శ్రీకి మ‌త్తు మందు ఇచ్చి ఆమెను స్పృహ కోల్పోయేలా చేశాడు. అయితే హత్య చేయాలనీ అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా పద్మశ్రీ స్నేహితుడు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు వారుంటున్న స్థలానికి చేరుకొని పద్మ శ్రీని కాపాడి శబరీష్ ని మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నలుగురు పరారిలో ఉన్నారు.

Leave a comment