ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య..! శోకసంద్రంలో తెలుగు యాంకర్స్..

tv-anchor-suside

విజయవాడ కి చెందిన ప్రముఖ న్యూస్ రీడర్ తేజస్విని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఆత్మహత్య కి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తేజస్విని గతంలో ఒక ఛానల్ లో న్యూస్ రీడర్ గ విధులు నిర్వహించారు. తనకి ఈ మధ్యనే పవన్ అనే వ్యక్తి తో పెద్దల సమక్షం లో వివాహం జరిగింది. పవన్ విజయవాడ నగరం శివారు లోని ఉయ్యూరు గ్రామంలో ఒక ప్రైవేట్ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నారు. విజయవాడ లో ఈడుపుగల్లు దగ్గర ఎం బి ఎం ఆర్ కాలనీ లో గత కొంత కాలంగా తేజస్విని తన భర్త తో నివాసం ఉంటున్నారు.

అయితే ఆదివారం రాత్రి తేజస్విని తన అత్త గారు అన్నపూర్ణ దేవి ల మధ్య ఏదో కారణం చేత చిన్న వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవ నెమ్మదిగా కొంచం శృతి మించగా ఇద్దరు పెద్దగా గొడవ పడ్డారని ఇంటి పక్కనున్న వారు వివరించారు. గొడవ సద్దుమణిగిన తరువాత తేజస్విని మనస్థాపం తో ఆమె గది లోనికి వెళ్లి గడి పెట్టుకోగా,
ఆమె ఎంత సేపటికి బయటికి రాకపోవటం తో అన్న పూర్ణ దేవి తలుపు తెరుచుకుని లోనికి వెళ్లారు, లోనికి వెళ్లిన వెంటనే తేజస్విని గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని కనిపించరు. ఇది గమనించిన అన్న పూర్ణ దేవి వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించగా, పోలీసులు తక్షణం ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a comment