Gossipsత్రివిక్రంకు హైపర్ ఆది డైలాగ్స్.. ఇది మరి టూమచ్..!

త్రివిక్రంకు హైపర్ ఆది డైలాగ్స్.. ఇది మరి టూమచ్..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కు డైలాగ్స్ ఇచ్చేంత సీన్ హైపర్ ఆదికి ఉందా.. ఎబ్బే అంత సీన్ లేదని తానే చెబుతున్నాడు. అసలు త్రివిక్రం కు డైలాగ్స్ రాయాల్సిన అవసరమే ఉండదు. ఆయనే కథ, డైలాగ్స్ అన్ని రాసుకుంటాడు. ఇక నాతో ఏం పని అంటున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన హైపర్ ఆది తన పంచుల ప్రవాహంలో బుల్లితెర ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాడు. షోలో ఆది ఉన్నాడంటే ఆ రోజు పండుగే అన్నట్టు లెక్క.

ఇక త్రివిక్రం అంటే తనకు చాలా అభిమానమని.. ఆయన్ను ఇప్పటివరకు మూడు సందర్భాల్లో కలిశానని చెప్పాడు హైపర్ ఆది. అయితే ఇటీవల త్రివిక్రం తో తాను దిగిన ఓ పిక్ సోషల్ మీడియాలో పెట్టగా త్రివిక్రం తర్వాత సినిమాకు హైపర్ ఆది మాటలను అందిస్తున్నాడని వార్తలు వచ్చాయి. వాటికి ఆన్సర్ ఇస్తూ ఆయనకు మరో రైటర్ అవసరం ఉండదు. ఆయనే అన్నీ రాసుకుంటారని అన్నాడు హైపర్ ఆది. ఈమధ్య జబర్దస్త్ కు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తున్న ఆది అటు స్మాల్, సిల్వర్ స్క్రీన్స్ పై తన సత్తా చాటుతున్నాడు.

ఈమధ్య సినిమా వేడుకలకు హైపర్ ఆది టీం స్కిట్స్ వేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. రీసెంట్ గా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో హైపర్ ఆది నటించాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news