ఎన్టీఆర్ సినిమా…ఆ పుకార్ల‌కు త్రివిక్ర‌మ్ చెక్‌..

ntr1trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ సినిమా పనుల్లో త్రివిక్రమ్ బిజీగా వున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మకంగా 25వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌మీద‌కు తీసుకెళ్లిపోతాడు. టాలీవుడ్ సినీ ప్రేక్ష‌కులు, నంద‌మూరి యంగ్‌టైగ‌ర్ అభిమానులు, అటు త్రివిక్ర‌మ్ అభిమానులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న ఈ సినిమా జ‌న‌వ‌రి నుంచి షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.

ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా ఇటీవ‌లే ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజ‌రై ఈ సినిమాను క్లాప్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి అప్పుడే కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా స్టోరీ 1980వ దశకంలో వచ్చిన ఓ పాపులర్ నవల ఆధారంగా ఉంటుంద‌ని,
ఈ నవల సినిమాగా తీయడానికి అవసరమైన రైట్స్ భారీ మొత్తం చెల్లించి త్రివిక్రమ్ సొంతం చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.

దీంతో పాటు ఈ సినిమాకు సోల్జ‌ర్ అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ పుకార్లు జోరుగా షికారు చేయ‌డంతో ద‌ర్శకుడు త్రివిక్ర‌మ్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా త‌న పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న త్రివిక్రమ్ ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ తో తాను చేయనున్న సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కనుందనే విషయంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు.

ఈ సినిమా త‌న గ‌త చిత్రాల్లాగానే కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఉంటుంద‌ని చెప్పాడు. ఇక ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో ట‌బు ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక‌వ్వ‌డం ఖాయ‌మైంద‌ట‌. ట‌బు ఎన్టీఆర్‌కు అత్త‌గా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది.

Leave a comment