రాజ‌మౌళి రూట్లోకి వ‌చ్చేసిన త్రివిక్ర‌మ్‌…

26

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శక ధీరుడు రాజమౌళి బాటలోకి వెళ్లాడా ? సినిమాకు ముందు రాజ‌మౌళి ఎలాంటి ప‌ద్ధ‌తులు ఫాలో అవుతున్నాడో ? ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా అవే ఫాలో అవుతున్నాడా ? అంటే సినిమా వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. రాజ‌మౌళి త‌న ప్ర‌తి సినిమాకు ముందుగా వ‌ర్క్ షాప్ కండెక్ట్ చేస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద టెక్నీషియ‌న్ అయినా వ‌ర్క్ షాప్‌కు వ‌చ్చి అక్క‌డ రిహ‌ర్స‌ల్ చేసి త‌ప్పు, ఒప్పులు తెలుసుకోవాల్సిందే.

ఈ విష‌యంలో రాజ‌మౌళి నుంచి ఎంత‌టి వారికి అయినా మిన‌హాయింపులు ఉండ‌వు. ఇప్పుడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కూడా సేమ్ టు సేమ్ ఇదే ప‌ద్ధ‌తి ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల షార్ట్స్‌ అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని, వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేసి, ఫుల్ గా రిహార్సల్ చేయిస్తున్నారట. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌.

ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ చేయిస్తోన్న రిహార్స‌ల్‌కు బ‌న్నీ కూడా అటెంట్ అవుతున్నాడ‌ట‌. హీరోయిన్ పూజాతో పాటు మిగిలిన కాంబినేషన్ ఆర్టిస్టుల సంగతి చెప్పనక్కరలేదు. ఈ పద్ధతి ద్వారా షూటింగ్ స్పాట్‌లో ఎలాంటి బ్రేకులు లేకుండా ఆర్టిస్టుల నుంచి మంచి పెర్పామెన్స్ రాబ‌ట్టుకునేందుకు వీలుంటుంది.

Leave a comment