Gossipsత్రివిక్రం అనుకున్నది అజ్ఞాతవాసి కాదా..!

త్రివిక్రం అనుకున్నది అజ్ఞాతవాసి కాదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా టైటిల్ విషయంలో మీడియా చూపించిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. అయితే కొన్నాళ్లుగా అజ్ఞాతవాసి అన్న టైటిల్ కన్ఫాం చేసి మీడియా హంగామా చేసింది. అయితే అసలు త్రివిక్రం అనుకున్న టైటిల్ అజ్ఞాతవాసి కాదట.

సినిమాలో కుష్బు ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుందట. అయితే అత్తారింటికి దారేది టైపులో ఒక టైటిల్ అనుకున్నాడట త్రివిక్రం. తాను అనుకున్న టైటిల్స్ లో అజ్ఞాతవాసి చివరిది కాగా మీడియా లీక్ అయిన ఈ టైటిల్ ఫ్యాన్స్ కు ఎక్కించేయగా ఇక ఫైనల్ గా ఆ టైటిల్ నే ఫిక్స్ చేశారని అంటున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2018 జనవరి 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news