ఆ ఫైట్ పై త్రివిక్రమ్ అసహనం..!

135

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావడంతో ఈ చిత్ర యూనిట్ మంచి ఆనందంగా ఉంది.. ఈ సినిమాలో ప్రతి సీన్ హైలెట్ అనే విధంగా తీయడం లో త్రీవ్రం కి మంచి మార్కులే పడ్డాయి. దీనికి తోడు ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయనే చెప్పాలి. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. దర్శకుడు త్రివిక్రమ్‌, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నటులు సునీల్, నవీన్ చంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు పాల్గొన్నారు.
2
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఎలివేషన్ విలన్ గొంతులో హీరో మొండికత్తిని దించేస్తాడు. సినిమా ఓపెనింగ్ లోనే ఇంత యాక్షన్ ఉంటే, ఇక క్లయిమాక్స్ ఫైట్ అదిరిపోతుందని అంతా ఆశించారు. కానీ అరవింద సమేత క్లైమాక్స్ లో ఫైట్ లేదు. అయినా ప్రేక్షకులు ఎక్కడా నిరాశపడలేదు.
1
వాస్తవంగా చెప్పాలంటే మేము ముందు ఒక యాక్షన్ క్లైమాక్స్ అనుకున్నాం. దాన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కూర్చుని అంతా డిస్క్రషన్స్ చేసినపుడు… క్లైమాక్స్‌లో యుద్ధం వద్దు అని చెప్పింది ఫైట్ మాస్టర్సే. చివర్లో ఫైట్ కంటే కూడా డైలాగులతో వెళ్లడమే దీనికి కరెక్టుగా ఉంటుందని చెప్పారు. ఇతర టెక్నీషియన్లకు కూడా ఇది నచ్చడంతో క్లైమాక్స్ మార్చేశాం అంటూ ఈ సినిమా సంగతులు చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.

Leave a comment