టాప్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న ఆ హీరోయిన్..!

18

వేరే భాషలో సినిమా హిట్ కొట్టగా ఆ సినిమాలో ఆమె నటనకు సౌత్ ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత అమ్మడు తెలుగులో ఓ క్లాసిక్ సినిమా డైరక్టర్ చేసిన సినిమాలో ఓ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సినిమా చేసి హిట్ కొట్టింది. సినిమాలో ఆమె నటనకు అందరు అవాక్కయ్యారు. ఇక ఇదే తన అసత్రం అన్నట్టుగా ఆమె సినిమాల్లో తన పోర్షన్ వరకు బాగా చేస్తూ వచ్చింది.

సినిమాల ఫలితాలు పాజిటివ్ గా వచ్చాయి. ఇదిలాఉంటే సినిమాలు చేయడం అటుంచితే ఆమె చేస్తున్న సినిమాల్లో హీరోల విషయంలో మాత్రం ఆమె ప్రవర్తన బాగుండదని తెలుస్తుంది. ఇది ఒకసారి కాదు ఇప్పటికే తాను చేసిన చివరి మూడు సినిమాల్లో ఇదే కంప్లైంట్ రిపీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ ప్రేమకథలో నటిస్తుంది. ఆ సినిమా హీరోని తన యాటిట్యూడ్ తో ఇబ్బంది పెడుతుందట.

యువ హీరో ఆమె ప్రవర్తనకు షాక్ అవుతున్నాడట. ఇక ఈ మధ్య ఓ క్రేజీ సినిమా ఛాన్స్ లో మరోసారి ఆ హీరోయిన్ తో అతను నటించే ఛాన్స్ రాగా సారీ ఆమె హీరోయిన్ అయితే తాను చేయనని చెప్పాడట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఇలా హీరోలను ఎందుకు టార్గెట్ చేస్తుందో ఆమెకే తెలియాలి.

Leave a comment