Gossipsప్రముఖ బడా నిర్మాత గుండె పోటుతో మృతి..!

ప్రముఖ బడా నిర్మాత గుండె పోటుతో మృతి..!

ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత త్యాగరాజన్ (74 ) ఆదివారం ఉదయం తమిళనాడు లోని తన స్వగ్రామం వలసరవాక్కంలో గుండెపోటుతో మృతి చెందారు. త్యాగరాజన్ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి ఆగ్ర నటులతో కూడా త్యాగరాజన్ పలు చిత్రాలకు నిర్మాతగా కూడా పని చేసారు. తన మరణ వార్త విన్న వెంటనే రజిని, కమల్ తో పాటు మరి కొంత మంది నిర్మాతలు, దర్శకులు త్యాగరాజన్ ఇంటికి చేరుకొని తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగరాజన్ కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

అలనాటి తమిళ నటుడు ఎంజీఆర్‌ తో కూడా త్యాగరాజన్ పలు చిత్రాలను నిర్మించారు. రజనీకాంత్‌తో తాయ్‌వీడు, తాయ్‌ మీదు సత్యం, అన్బుక్కు నాన్‌ అడిమై, అన్నై ఒర్‌ ఆలయం, కమలహాసన్‌ తో తాయ్‌ ఇల్లామల్‌ నాన్‌ ఇల్‌లై, రామ్‌లక్ష్మణన్ అనే సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఇలా సుమురుగా త్యాగరాజన్ 35 చిత్రాలను తెరకెక్కించారు. త్యాగరాజన్ మరణ వార్త తెలిసిన వెంటనే ప్రముఖ తెలుగు నటులు, దర్శకులు మరియు కొంత మంది నిర్మాతలు అతని ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news