ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ప్రముఖ తెలుగు రచయిత , దర్శకుడు..!

tollywood-director-jayasimh

రచయిత దర్శకుడు రాజ సింహా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు రైటర్ గా పనిచేస్తున్న రాజ సింహా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఒక అమ్మాయి తప్ప సినిమాకు దర్శకుడిగా పనిచేశాడు. రైటర్ గా సక్సెస్ అయినా డైరక్టర్ గా మారాక తనకు అవకాశాలు లేక ఖాళీ అవ్వాల్సి వచ్చిందట.

ముంబైలో నివాసం ఉంటున్న రాజ సింహా ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిద్ర మాత్రలను మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారట. అయితే వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారని తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రుద్రమదేవి సినిమాలో చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసింది రాజ సింహానే అని తెలిసిందే.

టాలెంట్ ఎంత ఉన్నా సరైన అవకాశాలు లేకుంటే ఇల్లు గడవడం కష్టమే. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రాజ సింహా ఇలాంటి స్టెప్ తీసుకుంటాడని ఎవరు ఊహించి ఉండరు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Leave a comment