ఆల్ టైం టాలీవుడ్ 5 మూవీస్ లిస్ట్ ..! ఎన్ని కోట్లు..?

tollywood-all-time-top-5-movies

స్టార్ సినిమా అంటే టీజర్ వ్యూస్ నుండి రిలీజ్ థియేటర్ కౌంట్ దాకా లెక్కలేసుకునే ఫ్యాన్స్ తమ హీరో ఇండస్ట్రీ రికార్డులు సాధించాడంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. కరెక్ట్ కంటెంట్ ఉన్న సినిమా పడితే స్టార్ హీరోల సత్తా ఏంటో బాక్సాఫీస్ కలక్షన్స్ ను బట్టి తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కన్నా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన టాప్ 5 మూవీస్ ఇలా ఉన్నయి.

వాటిలో ముందుగా బాహుబలి- ఉంది. 309 కోట్ల వరల్డ్ వైడ్ తెలుగు కలక్షన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, రానా పోటాపోటీగా నటించారు. ఇక ఆ తర్వాత ప్లేస్ లో కూడా బాహుబలి-1 189 కోట్లతో సత్తా చాటింది. ఇక మూడవ స్థానంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం నిలిచింది. 125 కోట్ల కలక్షన్స్ తో బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాడు రాం చరణ్. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో నిలిచిన సినిమా భరత్ అనే నేను. మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 105 కోట్లతో నాన్ బాహుబలి రికార్డులలో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 సినిమా 102 కోట్ల వరల్డ్ వైడ్ కలక్షన్స్ తో ఆల్ టైం టాప్ 5వ సినిమాగా నిలవగా నాన్ బాహుబలి రికార్డులలో టాప్ 3గా నిలిచింది.

Leave a comment