చివరిరోజుల్లో కూడా అత్మాభిమానం చంపుకోలేదు.. గుండు హనుమంతరావు కన్నుమూత..!

gundu-hanumantha-rao

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్రగడ్డలోని స్వగ్రుహంలోనే కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులున్నా సరే ఎవరిని చేయి చాచి అడుగని గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయన గురించి తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి ఆయన కిడ్నీ ఆపరేషన్ కు ఆర్ధిక సాయం అందించారు.

1956లో విజయవాడలో జన్మించిన గుండు హనుమంతరావు నాటకాల మీద ఉన్న ఇష్టంతో నాటకాలు వేస్తూ వచ్చారు. రావణబ్రహ్మ వేషంలో ఫేమస్ అయిన ఆయన దాదాపు 400 తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. తనదైన కామెడీ టైమింగ్ తో అలరించి ప్రేక్షక హృదయాలను గెలిచిన గుండు హనుమంతరావు మృతి సిని పరిశ్రమ దిగ్బ్రాంతిలో పడేసింది.

చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడిన గుండు ఏనాడు ఎవరితో గొడవ పడింది లేదు. ఈమధ్య మా సాయం చేసినా ఆయన్ను మాత్రం దక్కించుకోలేకపోయారు.

Leave a comment