Moviesభరత్ అనే నేను.. సొసైటీలో భయం, భాధ్యత ఉండాల్సిందే.. ప్రామిస్..!

భరత్ అనే నేను.. సొసైటీలో భయం, భాధ్యత ఉండాల్సిందే.. ప్రామిస్..!

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. సొసైటీ మీద గౌరవంతో ఓ పెద్ద భాధ్యతను అదే సిఎంగా అవతరించిన ఓ వ్యక్తి కథ భరత్ అనే నేను. అమ్మ చెప్పిన మాట అంటూ మొదలు పెట్టి సిఎంగా భరత్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన భరత్ అలియాస్ మహేష్ టీజర్ లోనే సినిమా కంటెంట్ ఏంటో తెలిసేలా చేశాడు.

శ్రీమంతుడు తరహాలో మళ్లీ కొరటాల శివ, మహేష్ ఇద్దరు కలిసి మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. సినిమా టీజర్ మాత్రం ప్రామిస్ చేసి చెప్పొచ్చు అదరగొడుతుందని. మహేష్ మాస్, క్లాస్ అభిమానులందరికి ఈ సినిమా నచ్చేస్తుందని చెప్పొచ్చు.

ఇక అసలు సిసలు చార్జ్ ఏప్రిల్ 20 నుండి మొదలవుతుందని తెలిసిందే. బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news