ప్రముఖ దర్శకుడు రాజ సింహా సూసైడ్ వెనుక.. అసలు ఏమి జరిగిందంటే..

rajasimha-director

ప్రముఖ రచయిత దర్శకుడు రాజ సింహా నిన్న ముంబైలో ఉంటున్న ఇంట్లో స్పుహ కోల్పోయి ఉండటంతో ఆయన నిద్ర మాత్రలు వేసుకున్నారని అవకాశాలు లేకనే ఇలా చేశారని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. తనకు షుగర్ లెవల్స్ తగ్గడం వల్ల పడిపోయానని అన్నారు.

షుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల ఆయాసం వచ్చిందని ఆ టైం లో ఇంట్లో వారు ఎవరు లేకపొవడంతో అలా కుప్పకూలిపోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే ఈ వార్తని రాజసింహా ఆత్మహత్యా యత్నం అన్నట్టుగా బయటకు రావడంతో ఆయన స్పందించడం జరిగింది. తనకు ఏమి కాలేదని మరో మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి అన్ని విషయాలు చెబుతా అని అన్నారు రాజ సింహా.

గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ వేసిన గోన గన్నారెడ్డి పాత్రకు మాటలు రాసింది రాజ సింహానే. ఆ తర్వాత దర్శకుడిగా ఒక అమ్మాయి తప్ప సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా ఆయన చేసిన మొదటి ప్రయత్నమే విఫలమైంది.

Leave a comment