Gossipsబ్రహ్మి కెరియర్ ని నాశనం చేసింది వాళ్లేనా..!

బ్రహ్మి కెరియర్ ని నాశనం చేసింది వాళ్లేనా..!

నవ్వుల రారాజు బ్రహ్మానందం.. ఆయన పేరు చెప్పగానే పెదవి మీద చిరునవ్వు వస్తుంది. అలాంటి బ్రహ్మానందం కెరియర్ పరంగా ఇప్పుడు చాలా వెనుకపడ్డాడు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్లంట సినిమాతో తెలుగు తెర మీద నవ్వులు విరజిల్లడం మొదలు పెట్టిన బ్రహ్మి 3 దశాబ్ధాల ప్రేక్షకులను అలరించారు.

హీరో ఎవరైనా.. దర్శకుడు ఎవరైనా.. బ్రహ్మానందం సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్.. పోస్టర్ పై బ్రహ్మానందం కనిపించాడు అంటే ఆ సినిమా లెక్క వేరే అన్న రేంజ్ ఆయనది. అయితే ఒకేరకమైన పాత్రలతో కనిపించేసరికి ప్రేక్షకులకు ఆయనంటే బోర్ కొట్టింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల్లో ఆయన కామెడీ హైలెట్ గా ఉండేది. వెంకీ నుండి బ్రూస్ లీ వరకు ఆయన బ్రహ్మితో సేం కామెడీ పండించారు.

అయితే మిస్టర్ సినిమాలో బ్రహ్మానందం లేకున్నా సినిమా ఆడలేదు. ఇలా బ్రహ్మానందంతో రొటీన్ కామెడీ చేసిన శ్రీను వైట్ల కెరియర్ పరంగా వెనుకపడి ఉన్నాడు. అయితే ప్రస్తుతం రవితేజతో చేస్తున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో బ్రహ్మానందం లేరని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ లో కమెడియన్స్ తో దిగిన ఫోటో శ్రీను వైట్ల షేర్ చేశారు. దీని చూసి బ్రహ్మానందం అభిమానులు హర్ట్ అవుతున్నారు. బ్రహ్మిని సినిమాలో ఉంచితే తమ కాంబినేషన్ లో రొటీన్ కామెడీ వస్తుందన్న భావనతో ఆయన్ను తీసుకోలేదట. మరి బ్రహ్మి లేకుండా శ్రీను వైట్ల చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news