సర్దార్ స్టోరీ వెనుక ఇంత నడిచిందా..! అసలు స్టోరీ ఇదేనంట !!

pawan-kalyan-sardar-gabbar-

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ జాని సినిమా తర్వాత కలం పట్టి రాసిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఆ సినిమా ఫలితం పవన్ ను మరోసారి డిసప్పాయింట్ చేసింది. అయితే రతన్ పూర్ లో నడిచే ఈ కథ అసలు పవన్ రాసుకున్న ఒరిజినల్ వెర్షన్ వేరే అంటూ వార్తలు వస్తున్నాయి. రతన్ పూర్ లో పోలీస్ గా రౌడీలను చీల్చి చెండాడుతున్న సర్దార్ ను యాక్సిడెంట్ చేయించి కోమాలో పంపించేస్తారట విలన్లు.

ఇక అలా కోమాలో ఉన్న సర్దార్ స్థానంలో మరో పవన్ వస్తాడట. వారి పని పట్టి చివరగా కోమాలో ఉన్న వ్యక్తి కూడా బయటపడి ఇద్దరు కలిసి విలన్ల పని పట్టడమే సినిమా కథట. సినిమాలో పవన్ రాసుకున్న ఒరిజినల్ వర్షన్ లో డ్యుయల్ రోల్ అని తెలుస్తుంది. అయితే ఒరిజినల్ కథ కూడా విక్రమార్కుడు, బిల్లా సినిమాలకు దగ్గర పోలికలు ఉండటంతో పవన్ ఆ కథ పక్కనపెట్టాడట.

అంతేకాదు జనసేన పార్టీ మొదలు పెట్టిన మొదట్లో పవన్ కనిపించిన జుట్టు, గెడ్డం లుక్ సర్దార్ గబ్బర్ సింగ్ సెకండ్ రోల్ కోసమని అంటున్నారు. కథ పాతదే అయినా పవన్ డ్యుయల్ రోల్ చేస్తే ఆ కిక్ వేరేలా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

Leave a comment