ఐపిఎల్ ఫైనల్ లో ఆ రెండు జట్లు.. ఆగ్రహంలో హైదరబాద్ ఫ్యాన్స్..!

ipl-2018-finals

ఐపిఎల్ సీజన్ లో క్రికెట్ కు సంబందించి ఏ చిన్న వార్త అయినా సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలో హాట్ స్టార్ ప్లే చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను ఆగ్రహావేశాలను కలిగేలా చేస్తుంది. ఇంతకీ హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఎందుకు కోపం వచ్చింది అంటే చెన్నై సూపర్ కింగ్స్, కలకత్తా నైట్ రైడర్స్ ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ అని ప్రసారం చేయడమే.

తొలి క్వాలిఫైయర్ లో విజయం సాధించిన చెన్నై ఫైనల్ కు వెళ్లింది. అయితే ఎలిమినేటర్ లో గెలిచిన కలకత్తా నైటర్ రైడర్స్ సన్ రైజర్స్ తో క్వాలిఫైయర్ 2 లో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఆ జట్టు చెన్నైతో ఫైనల్ ఆడుతుంది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓడినట్టు కలకత్తా ఫైనల్ కు వెళ్లినట్టు హాట్ స్టార్ ఐపిఎల్ ఫైనల్ జట్లు ఇవే అని ప్రసారం చేసే వీడియో సంచలనంగా మారింది.

ఐపిఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కువగా నడుస్తుంది ఇక హాట్ స్టార్ వీడియో పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగా మీకు ముందే ఎలా తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a comment