అతనితో డేటింగ్ కు రెడీ అంటున్న తమన్నా..!

124

మిల్కీ బ్యూటీ డేటింగ్ కు అడగాలే కాని కాదని అనే వారు ఎవరు ఉండరు. ఆమెను డేటింగ్ కు తీసుకెళ్లే ఆలోచన చాలా మందికి ఉండే ఉంటుంది. అయితే ఓ హీరోయిన్ అయ్యుండి ఓ హీరోతో తాను డేటింగ్ కు సిద్ధమని చెప్పడం మాత్రం తమన్నాకే చెల్లింది. ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ లో నటించిన విక్కి కౌశల్ తో తాను డేటింగ్ కు వెళ్లాలని ఉందని చెబుతుంది తమన్నా.

హీరోయిన్ గా దశాబ్ధ కాలం నుండి సత్తా చాటుతూ వస్తున్న తమన్నా ఈమధ్య కెరియర్ కాస్త వెనుకపడినట్టు అనిపించినా మళ్లీ జోరందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది తమన్నా. ఉరిలో విక్కీ కౌశల్ నటనకు ఫిదా అయిన తమన్నా ఛాన్స్ వస్తే అతనితో డేటింగ్ కు వెళ్తానని అంటుంది. తమన్నా ఏరి కోరి మరి అతన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అన్నది ఆమెకే తెలియాలి.

తమన్నా ఆఫర్ కు కౌశల్ ఏమని సమాధానం ఇస్తాడు. నిజంగానే అతనికి ఆ ఆశ ఉంటే ఇద్దరు ఎంచక్కా డేట్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. మిల్కీ బ్యూటీ తమన్నా మనసు గెలిచిన విక్కీ కౌశల్ బాలీవుడ్ లో మంచి ఇమేజ్ తెచ్చుకునేలా ఉన్నాడు. ఇక తమన్నా ప్రస్తుతం దేవి 2, దటీజ్‌ మహాలక్ష్మి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటిస్తుంది.

Leave a comment