Gossipsతమన్నాకి అక్కడ ఛాన్స్ వచ్చిందా ..?

తమన్నాకి అక్కడ ఛాన్స్ వచ్చిందా ..?

గ్లామర్, అభినయంతో తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో ప్రతిభను చాటుకుంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. అప్పట్లో బాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తళుకుమన్న ఈ తార కలం కలిసి రాకపోవడంతో మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అక్కడ రెండు, మూడు సినిమాల్లో మెరిసింది కానీ అవేమి వర్కౌట్ కాలేదు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ మళ్లీ బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ క్రేజీ సినిమాలు నటించింది ఈ మిల్క్ బ్యూటీ. ఐతే, ఇప్పుడు .తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా పర్హాన్ నటిస్తుండగా, తమన్నాకు హీరోయిన్ ఆఫర్ ఇచ్చారు.
ఎప్పుడు ఏ విషయం ఎందుకు కలిసొస్తుందో ఎవరూ చెప్పలేరు కదా!

నిశి కాంత్ కామత్ దర్శకత్వం తెరకెక్కబోతోన్న ఈ రీమేక్ సినిమాలో సంజయ్ దత్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ప్రస్తుతం తమన్నా తెలుగు ‘క్వీన్’ రిమేక్ లో నటిస్తోంది. క్వీన్ రిమేక్ ఏకకాలంలో నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. ఇప్పుడైనా ఈ బ్యూటీకి బాలీవుడ్ లో స్థిరపడుతుందో లేక మళ్ళీ తిరిగిటపాలో వచ్చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news