బిగ్‌ బాస్ విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా….?

telugu-bigg-boss-contestants-winners-prize-money

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన ‘బిగ్ బాస్’ మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో విజేతకు ఎంత మొత్తం చెల్లిస్తారనేదానిపై ఇప్పటి వరకు స్పష్టతలేదు. స్టార్ ఛానల్ కానీ, బిగ్ బాస్ నిర్వాహకులు గానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే 21వ ఎపిసోడ్‌లో బిగ్ బాగ్ షో విజేతకు ఎంత చెల్లించనున్నారో ఎన్టీఆర్ ప్రకటించారు. ‘నా టీవీ’ ద్వారా హౌజ్‌లో ఉన్న పోటీదారులకు, ప్రేక్షకులకు ఒకేసారి సర్‌ప్రైజ్ ఇచ్చారు. విజేతకు అక్షరాల రూ. 50 లక్షలు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇంకా మున్ముందు చాలా బహుమతులే ఉంటాయని హౌజ్‌మేట్స్‌ను ఉత్సాహపరిచారు. ఒకవేళ రూ. 50 లక్షలు గెలుచుకుంటే వాటితో మీరు ఏంచేస్తారు?’ అని హౌజ్‌మేట్స్ ఎన్టీఆర్ అడిగారు. దీనికి ఒక్కక్కొరు ఒక్కో సమాధానం ఇచ్చారు.

రూ. 50 లక్షలు గెలుచుకుంటే ఏంచేస్తారని ఎన్టీఆర్ మొదటిగా ధనరాజ్‌ను అడిగారు. ‘నాకు మాటిచ్చావ్.. కచ్చితంగా షోలో గెలిచే ఇంటికి రావాలి అని మీ భార్య మిమ్మల్ని అడిగారు. మరి ఈ డబ్బుతో ఏంచేస్తారు?’ అని ఎన్టీఆర్ ధనరాజ్‌ను ప్రశ్నించారు. దీనికి ధనరాజ్ సమాధానం చెపుతూ.. ‘ఒక మంచి ఇంటిని గిఫ్ట్‌గా ఇస్తానని మా ఆవిడకి మాటిచ్చానన్న. ఈ డబ్బులు గెలుచుకుంటే కొత్త ఇంటిని కొని మా ఆవిడకి, బాబుకి గిఫ్టుగా ఇస్తాను. ఒకవేళ ఈ షోలో గెలవకపోయినా నేను చచ్చిపోయే లోపు ఎలా అయినా ఇల్లుకొని మా ఆవిడకి గిఫ్టుగా ఇస్తాను’ అని చెప్పి చప్పట్లు కొట్టించుకున్నాడు. తీసుకెళ్లి మా ఆవిడ చేతిలో పెడతాను. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో నేను చాలా పెద్ద బొక్క (ఎన్టీఆర్ నవ్వులు). కాబట్టి తనకిచ్చేస్తే తనే చూసుకుంటుంది. నా ఖర్చులకు కాస్త అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది.

-మహేష్ కత్తి ఇప్పటి వరకు నా ఆర్థికలావాదేవీలన్నీ మా అమ్మే చూసుకుంది. అందుకే రూ. 50 లక్షలు గెలుచుకుంటే తిన్నగా తీసుకెళ్లి మా అమ్మకు ఇచ్చేస్తా. ఆ తరవాత ఆమె పర్సులో నుంచి రోజూ రూ. 500 పాకెట్ మనీ తీసుకుంటా.

-ముమైత్ ఖాన్ డబ్బు మా అమ్మకు ఇస్తాను. మిగిలిన డబ్బుతో ఓ ఇళ్లు కొంటాను.

-అర్చన ఒక ఆలోచన అంటూ ఏమీ లేదు. కచ్చితంగా స్ఫూర్తినిచ్చే పనే చేస్తాను.

-శివ బాలాజీ పెళ్లిచేసుకున్న తరవాత నా భార్యను సొంతింట్లోకి తీసుకెళ్దాం అనుకున్నాను కుదరలేదు. నా కొడుకు ఆరిష్ పుట్టాకా కూడా అనుకున్నాను. కానీ అదీ కుదరలేదు. ఇప్పడు నా భార్య ఐదో నెల గర్భవతి. పుట్టే బిడ్డనైనా సొంతింటిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను.

– సమీర్రూ. 50 లక్షల్లో ఒక్క పైసా కూడా ముట్టను. నా కొడుకు ధ్రువ పేరుమీద మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేస్తా.

– కత్తి కార్తీక టాలెంట్ ఉన్నా లేకపోయినా ఈ ఇండస్ట్రీలో ఎంత వరకు సర్వైవ్ అవుమనేది గ్యారంటీ లేదు. కాబట్టి నేనున్నా లేకపోయినా నా పాప వేరొకరి దగ్గరికి వెళ్లి చేయిచాచకుండా కొంత ఇచ్చేస్తా.

ప్రస్తుతం నేను బదిర విద్యార్థులకు పార్ట్‌టైమ్ టీచర్‌గా ఉన్నాను.. ఇకపై ఫుల్‌టైమ్ టీచర్‌గా కనసాగాలని అనుకుంటున్నాను. దానికి కొంత డబ్బు ఉపయోగిస్తాను – కల్పన

Leave a comment