బిగ్ బాస్-3లో సెక్సీ భామలు.. ఆడియెన్స్ కు కావాల్సినంత మజా..!

119

బిగ్ బాస్ తెలుగు సీజన్-3కి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ కంటెస్టంట్స్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. హోస్ట్ గా ఎవరా ఎవరా అని అటు తిరిగి ఇటు తిరిగి కింగ్ నాగార్జుననే ఫైనల్ చేశారని తెలిసిందే. త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈసారి కంటెస్టంట్స్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సీజన్ 2 లా గేమ్ అంతా వన్ సైడ్ గా కాకుండా విజేత ఎవరన్నది చివరిదాకా సస్పెన్స్ కొనసాగేలా కంటెస్టంట్స్ ఎంపిక జరుగుతుందట.

అంతేకాదు కంటెస్టంట్స్ ను సెలబ్రిటీస్ ను తీసుకోమని నాగ్ ఆర్డర్ చేశాడట. సో అందుతున్న లీక్స్ ప్రకారం బిగ్ బాస్ 3లో యాంకర్ శ్రీముఖి, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుప్తా కూడా కంటెస్టంట్స్ గా వస్తున్నారట. అందుకే ఈసారి బిగ్ బాస్ లో సెక్సీ భామల సందడి ఉంటుందని అంటున్నారు. ఆడియెన్స్ కు కావాల్సినంత మజా ఇచ్చేలా టాస్కులు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇంతమంది భామలు వస్తున్నారంటే హౌజ్ లో లవ్ స్టోరీస్ కు కొదవ ఉండదని చెప్పొచ్చు.

మొత్తానికి నాగ్ హోస్ట్ గా బిగ్ బాస్ కలర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తుంది. హోస్ట్ గా నాగార్జునకు పెద్ద టఫ్ టాస్క్ కాదు ఎమ్.ఈ.కే సూపర్ హిట్ చేసిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 పక్కా హిట్ కొట్టేస్తాడని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేశారు. ఈసారి సీజన్ 3 కోసం మన్మథుడిని తీసుకొచ్చారు. మరి హౌజ్ లో అల్లరి తక్కువ అయితే ఆ భామల మధ్యకు ఈ మన్మథుడు కూడా దూరేస్తాడేమో చూడాలి.

Leave a comment