టీజర్ తోనే మేటర్ తేల్చేయొచ్చు..!

akill

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా చేస్తున్న రెండవ ప్రయత్నం హలో. విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్స్ అయితే అంచనాలు ఏర్పరుస్తున్నాయి. పోస్టర్స్ లో అఖిల్ నేల మీద మాత్రం నిలబడటం లేదు. గాల్లో తేలుతూ వెరైటీగా కనిపిస్తున్న అఖిల్ ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడని మాత్రం చెప్పొచ్చు. ఇక సినిమా టీజర్ ఈ నెల 16న అంటే రేపు రిలీజ్ చేయనున్నారు.

అనుకున్న విధంగానే డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కూడా ఉంటుందట. మరి సినిమాకు శాంపిల్ గా వదిలే టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుందా లేదా అన్నది చూడాలి. అసలు సినిమాలో ఏమాత్రం మేటర్ ఉంది అన్నది కూడా ఈ టీజర్ తోనే చెప్పేయొచ్చు. విక్రం కుమార్ హలోని స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. నాగార్జున నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Leave a comment