Moviesతేజ్ ఐలవ్యూ " ప్రీ-రివ్యూ "

తేజ్ ఐలవ్యూ ” ప్రీ-రివ్యూ “

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా తేజ్ ఐలవ్యూ. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.

టైటిల్ చూసే ఇదో పక్కా లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.. సాయి ధరం తేజ్, అనుపమ ఇద్దరు ప్రేమికులుగా కనిపిస్తున్నారు. కథ విషయానికొస్తే అమ్మాయిలను ప్రేమలో ఎలా పడేయాలో అనే టాస్క్ లో డిగ్రీ పూర్తి చేసిన హీరో.. తనకు నచ్చిన అమ్మాయిని అలానే ట్రాప్ చేస్తాడు. అయితే అతను ట్రాప్ చేశాక అసలు విషయం తెలుస్తుంది ట్రాప్ చేసిన అతను కాదు ఆమె అని.

హీరో చేస్తున్న వేశాలన్నిటిని నమ్మి అతన్ని తన ముగ్గులోకి దించుతుంది హీరోయిన్. అయితే సడెన్ గా తన బోయ్ ఫ్రెండ్ గా నటించమని అడుగుతుంది. అలా ఆమె బోయ్ ఫ్రెండ్ గా నటిస్తూ నటిస్తూ ఆమెతో నిజంగానే ప్రేమలో పడతాడు హీరో. ఈ కథ కరుణాకరణ్ ఎంత అందంగా తెరకెక్కించాడో రేపు సినిమా చూస్తే తెలుస్తుంది.

గోపిసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పాటలు కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా అవనున్నాయి. మరి ఐదు ఫ్లాప్ సినిమాల తర్వాత తేజూ చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news