Gossipsతేజ్ ప్రభావం పంతం మీద పడుతుందా..!

తేజ్ ప్రభావం పంతం మీద పడుతుందా..!

ఓ పక్క మాస్ ఇమేజ్ పెంచుకున్న గోపిచంద్ హీరో కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులను చవిచూస్తున్నాడు. మరో పక్క మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో తన మార్క్ మూవీ అందించలేక అపజయ పాలవుతున్నాడు. ఈ ఇద్దరు తమ లేటెస్ట్ మూవీస్ పంతం, తేజ్ ఐలవ్యూ సినిమాలు ఒకరోజు తేడాతో బాక్సాఫీస్ ఫైట్ కు దిగాయి.

పంతం ఆల్రెడీ నిన్న (గురువారం) రిలీజ్ అయ్యి మిక్సెడ్ టాక్ తెచ్చుకోగా.. ఈరోజు రిలీజ్ అవుతున్న తేజ్ ఐలవ్యూ ప్రీమియర్స్ షో నుండి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఏ సినిమా ప్రభావం ఏ సినిమా మీద పడుతుంది అన్నది ఆసక్తిగా మారింది. మెగా కాంపౌండ్ నుండి వచ్చి తన ఎనర్జీతో ఫ్యాన్స్ ను మెప్పించిన సాయి ధరం తేజ్ ఈ తేజ్ ఐలవ్యూ సినిమాతో లవర్ బోయ్ గా వస్తున్నాడు.

కరుణాకరణ్ డైరక్షన్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కె.ఎస్ రామారావు నిర్మించారు. మరి పంతం పై తేజ్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఈరోజు సాయంత్రం కల్లా తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news