Gossipsరావాలి ఎన్టీఆర్.. కావాలి ఎన్టీఆర్..! టీడీపీలో ఈ నినాదం మొదలయ్యిందా ?

రావాలి ఎన్టీఆర్.. కావాలి ఎన్టీఆర్..! టీడీపీలో ఈ నినాదం మొదలయ్యిందా ?

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఘోర ఓటమి ఎప్పుడూ ఎదురవ్వలేదు. చాలా సార్లు అధికారానికి దూరం అయినా చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను సాధించి అధికార పార్టీకి ధీటుగా ఉన్నట్టు టీడీపీ ఉండేది. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలికి టీడీపీ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. టీడీపీ అధికారంలో ఉండగా పాదయాత్ర చేపట్టి 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి తన ప్రభంజనాన్ని చాటిచెప్పాడు. అయితే అప్పుడు కూడా టీడీపీ ఫర్వాలేదు అనే స్థాయిలో సీట్లను సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ తుడుచు పెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్ళీ పుంజుకోవాలంటే ఏమి చేయాలి ? మళ్ళీ పూర్వ వైభవం ఎలా వస్తుంది అనే అనేక ప్రశ్నలు టీడీపీ అభిమానుల్లో తలెత్తుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ ఇప్పుడప్పుడే పుంజుకునే అవకాశం కనిపించడంలేదు. ఒక వైపు చూస్తే చంద్రబాబు కి వయస్సు మీద పడిపోతోంది. ఆయన కుమారుడు లోకేష్ పార్టీని నడిపే అంత తెలివితేటలు ఉన్నాయో లేదో అందరికి తెలుసు. ఈ దశలో పార్టీకి పునర్వవైభం తీసుకొచ్చే నేత ఎవరా అనే ఆరా తీస్తున్నారు టీడీపీ అభిమానులు కొందరు. ఈ దశలో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదకు తీసుకొస్తున్నారు కొందరు. ఇప్పుడు టీడీపీ తరపున గెలిచిన కొద్దిమంది ఎమ్యెల్యేలు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారో లేక వైసీపీలోకి జంప్ చేస్తారో తెలియదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తారని అంతా భావిస్తున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందితే ఎన్టీఆర్ ఒక్కరే దిక్కవుతారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. తెలుగుదేశం ఇప్పుడు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ అభిప్రాయం మరింత బలపడుతోంది. అంతకు ముందే జనాలు సామాజిక మాధ్యమాల్లో ఎన్టీఆర్ టీడీపీని లీడ్ చేయాలంటూ పెద్దఎత్తున పోస్టింగ్స్ పెడుతూ కనిపించారు. తెలుగుదేశం మద్దతుదారులు సైతం పార్టీని ఎన్టీఆర్‌కు అప్పగించాలని పెద్ద ఎత్తున అభిప్రాయపడుతున్నారు. కానీ చంద్రబాబు ఇందుకు ఒప్పుకుంటారా ? తన కుమారుడిని కాదని ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అందిస్తే ఏమవుతుందో అందరికంటే బాబు కే బాగా తెలుసు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ విధమైన స్టెప్ వేస్తాడో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news